Gurla: గుర్ల మండలంలో యువకుడు ఆత్మహత్య

Gurla: విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు గ్రామంలో మనస్తాపంతో యువకుడు ఉరివేసుకొని మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 17 Aug 2026 7:10 PM IST
Gurla
X

Gurla: గుర్ల మండలంలో యువకుడు ఆత్మహత్య

గుర్ల: తేదీ 17.08.2026 న కోటగండ్రేడు గ్రామానికి చెందిన వనుము దేవకినందన్, S/o దాలి నాయుడు, వయస్సు 21 సంవత్సరాలు, కులం: యాదవ అనే యువకుడు మనస్తాపంతో గ్రామంలోని వారి పొలంలో ఉరి వేసుకొని మృతి చెందారు.

సమాచారం అందుకున్న వెంటనే గుర్ల పోలీస్ స్టేషన్ SI శ్రీ పి. నారాయణరావు గారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story