Bhogapuram: భోగాపురం మండలం ముంజేరు పాఠశాలలో చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థులు
Bhogapuram: భోగాపురం మండలం ముంజేరు జడ్పీ హైస్కూల్‌లో రాఖీ పండగ సందర్భంగా విద్యార్థులు చెట్లకు ప్రకృతి వనరులతో తయారు చేసిన రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు.
Bhogapuram: భోగాపురం మండలం ముంజేరు పాఠశాలలో చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థులు
భోగాపురం: రాఖీ పండగ సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని చెట్లకు విద్యార్థులు ప్రకృతి వనరులతో తయారు చేసిన రాఖీలను కట్టి, చెట్లను తమ సోదరులుగా భావిస్తూ వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మొక్కలు నాటించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. చెట్లు మనకు స్వచ్ఛమైన గాలి, నీడతో పాటు జీవనాధారమైన అనేక వనరులను అందిస్తున్నాయని, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉపాధ్యాయులు తెలిపారు.
“చెట్లను కాపాడతాం.. మొక్కలను నాటుతాం.. ప్రకృతిని పరిరక్షిస్తాం” అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాఖీ పండగకు సోదర–సోదరీమణుల అనుబంధంతో పాటు ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని ముడిపెట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణ స్పృహను పెంపొందించింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం. హేమలత, సైన్స్ ఉపాధ్యాయులు, త్రినాధ్, సునీత, గౌరీ, సీనియర్ ఉపాధ్యాయులు సన్యాసిరావు, షణ్ముఖ రావు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




