Vizianagaram: ఎస్.కోట మండలం చీడిపాలెం గ్రామంలో యువకుడు ఆత్మహత్య
Vizianagaram: విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం చీడిపాలెంకు చెందిన గుద్దెల నాగ మణికంఠ (16) శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Vizianagaram: ఎస్.కోట మండలం చీడిపాలెం గ్రామంలో యువకుడు ఆత్మహత్య
విజయనగరం: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చీడిపాలెం గ్రామానికి చెందిన గుద్దెల నాగ మణికంఠ (16) శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మణికంఠ ఇంటర్మీడియట్ ఒకేషనల్‌లో చేరి, కొంతకాలానికే చదువు మానేశాడు. ఓ బాలికను ప్రేమిస్తున్నానని, ఆమెతో వివాహం చేయాలని తల్లిదండ్రులతో తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం.
మణికంఠ తండ్రినీ బలంగా కొట్టడంతో గాయమై ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తల్లి ఇంటికి ఫోన్ చేసినా కుమారుడు స్పందించకపోవడంతో గ్రామానికి వెళ్లింది.
ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా మణికంఠ ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఘటనపై ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




