Vizianagaram: పెదమజ్జిపాలెం పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం 4.0
Vizianagaram: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదమజ్జిపాలెం జెడ్పీ హైస్కూల్లో ఘనంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్. హాజరైన డిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున.
Vizianagaram: పెదమజ్జిపాలెం పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం 4.0
విజినగరం: పెదమజ్జిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదమజ్జిపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ MPTM 4.0 ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి సమావేశమై, వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ముచ్చటించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు.
Next Story




