Chepurupalli: చీపురుపల్లిలో అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

Chepurupalli: విజయనగరం జిల్లా చీపురుపల్లి అన్న క్యాంటీన్‌లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ శ్రీ రామ సుందర్ రెడ్డి. టోకెన్ తీసుకొని స్వయంగా భోజనం చేసిన కలెక్టర్.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 12 Aug 2026 10:57 PM IST
Chepurupalli
X

Chepurupalli: చీపురుపల్లిలో అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

చీపురుపల్లి: విజయనగరం జిల్లా, చీపురుపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ రామ సుందర్ రెడ్డి గారు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లిలో ఉన్న అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా క్యాంటీన్ లోని పరిశుభ్రత, వంట నాణ్యత, ఆహార పదార్థాల రుచి, ధరలను కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించారు.

తనిఖీలో భాగంగా కలెక్టర్ గారు స్వయంగా టోకెన్ తీసుకొని క్యాంటీన్ లో భోజనం కూడా చేశారు. ఆహారం నాణ్యత, రుచి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

పేద, మధ్యతరగతి ప్రజలకు రాయితీ ధరకే నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రతి ఒక్కరికీ సకాలంలో శుభ్రమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ గారు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, క్యాంటీన్ సిబ్బంది పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story