Vizianagaram: గుర్లలో నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్.. దొంగల సమాచారం తెలిస్తే ఇక్కడే చెప్పండి!

Vizianagaram: విజయనగరం జిల్లా గుర్లలో బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాకెళ్లిన దొంగలు.

Narsimha Reddy
Published on: 17 May 2026 9:48 PM IST
Vizianagaram
X

Vizianagaram: గుర్లలో నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్.. దొంగల సమాచారం తెలిస్తే ఇక్కడే చెప్పండి!

విజయనగరం జిల్లా: గుర్ల గ్రామంలో ఈరోజు చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఒక మహిళ మెడలోని బంగారు చైన్‌ను, వెనుక నుండి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లాక్కొని గరివిడి మార్గం వైపు పారిపోయారు.

నిందితుల వివరాలు:

ఇద్దరు వ్యక్తులు ఒకే మోటార్ సైకిల్‌పై వచ్చారు. ఘటన అనంతరం గరివిడి వైపు వేగంగా వెళ్లిపోయారు.

పోలీసుల విజ్ఞప్తి:

ఈ ఘటనకు సంబంధించి నిందితుల ఆచూకీ, వారు వినియోగించిన మోటార్ సైకిల్ నంబర్, లేదా ఏదైనా ఇతర సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే గుర్ల పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాము.

సమాచారం అందించాల్సిన నంబర్:

గుర్ల SI గారు - 9121109443

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రజలు సహకరించి నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహాయపడగలరు.

ప్రజలకు సూచన: మహిళలు, వృద్ధులు రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు బంగారు ఆభరణాలు ధరించి వెళ్లడం వీలైనంత వరకు నివారించాలి. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 / 112 కు సమాచారం ఇవ్వాలి.

Narsimha Reddy

Narsimha Reddy

Next Story