Parvathipuram: మృత్యువు నీడలో జంపరకోట.. ఒకే రోజు 5 మరణాలతో కన్నీరుమున్నీరు!

Parvathipuram: మన్యం జిల్లా పాలకొండ మండలం జంపరకోట గ్రామంలో పెను విషాదం నెలకొంది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 1 May 2026 11:38 AM IST
Parvathipuram
X

Parvathipuram: మృత్యువు నీడలో జంపరకోట.. ఒకే రోజు 5 మరణాలతో కన్నీరుమున్నీరు!

పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ మండలం జంపర కోట గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది.. ఒకే గ్రామానికి చెందిన వేరు వేరు ప్రమాదల్లో 5 గురు మృతి చెందారు..లక్ష్మీవారం ఉదయం సీతంపేట మండలం వాభ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సును బైక్ డీ కొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న జీలకర్ర. మోహనరావు అనే వ్వక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.. తీవ్ర గాయాలు పాలైన అతని భార్యను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి కి తరలించారు చికిత్స పొందుతూ భార్య వరలక్ష్మి మృతి చెందింది..ఇదే రోజు సాయంత్రం పాలకొండ మండలం జంపర కోట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

సీతంపేట మండలం పుబ్బాడ గ్రామంలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇదే గ్రామానికి చెందిన ఇంకో ముగ్గురు మహిళలు కొండగొర్రి.శ్రావణి,ఆరిక లక్ష్మి, ఉర్లక. శాంతి మృతిచెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. ఒకే గ్రామానికి చెందిన 5 గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.. జిల్లా sp మాధవ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్ సప్నిల్ పవార్ క్షతగాత్రులకు మైరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story