Thettangi: తెట్టంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ

Thettangi: తెట్టంగి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఘనంగా తిరంగా ర్యాలీ. దేశభక్తి నినాదాలతో మార్మోగిన గ్రామం. పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 12 Aug 2026 9:47 PM IST
Thettangi
X

Thettangi: తెట్టంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ

తెట్టంగి: దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా *ZPHS THETTANGI పాఠశాలలో తిరంగా ర్యాలీ అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.

ప్రజలలో దేశభక్తిని పెంపొందించడం, దేశ గౌరవాన్ని కాపాడడం, జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

విద్యార్థులు దేశభక్తి గీతాలు పాడుతూ, చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని సాగిన ర్యాలీ గ్రామంలోని ప్రజలను ఆకట్టుకుంది. కార్యక్రమ చివరలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. “స్వాతంత్ర్యం మన హక్కు... దేశ సమైక్యత మన బాధ్యత” అనే సందేశంతో కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story