srungavarapukota: వ్యసన రహిత సమాజమే లక్ష్యం: ఎస్.కోటలో బ్రహ్మాకుమారీస్

srungavarapukota: విజయనగరం జిల్లా శృంగవరపుకోట జూనియర్ కళాశాలలో బ్రహ్మాకుమారీస్, పోలీస్ శాఖ సంయుక్తంగా "నషా ముక్త భారత్ అభియాన్" అవగాహన సదస్సు నిర్వహించారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA
Published on: 7 Aug 2026 5:33 PM IST
srungavarapukota
X

srungavarapukota: వ్యసన రహిత సమాజమే లక్ష్యం: ఎస్.కోటలో బ్రహ్మాకుమారీస్

srungavarapukota: ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి సూచనలతో నిర్వహిస్తున్న '10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం"లో భాగంగా శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నశాముక్త భారత్ అభియాన్ S.కోట బ్రహ్మకుమారిస్, పోలీసు వారితో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని Ci V. నారాయణ మూర్తి Si సత్యనారాయణ, P V కృష్ణమూర్తి కళాశాల ప్రిన్సిపల్శృంగవరపుకోట బ్రహ్మకుమారి శాఖ ఇంచార్జ్ Bk శైలజ ప్రారంభించారు.

Ci నారాయణ మూర్తి మాట్లాడుతూ యువత వ్యసనాల బారిన పడి డబ్బుల కోసం గంజాయి సప్లై వంటికార్యక్రమాల్లోతెలియకుండానేఇరుక్కుంటున్నారని అలా ఎవరు పట్టుబడిన ఉపేక్షించేది లేదని కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామనివిద్యార్థులందరినీహెచ్చరించారువిద్యార్థులందరూ మీ మీ భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకొని సమాజానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.సిస్టర్ శైలజ మాట్లాడుతూ, ఈ ప్రచారం కేవలం మాదకద్రవ్యాల నివారణ కార్యక్రమం మాత్రమే కాదని, మాదకద్రవ్యాల రహిత, ఆరోగ్యవంతమైన, వికసిత భారత నిర్మాణానికి సంబంధించిన జాతీయ ప్రజా ఉద్యమం అని తెలిపారు.

భారత ప్రభుత్వం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని "నషా ముక్త భారత్ అభియాన్", గృహ మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) యొక్క "మిషన్ స్పందన్", అలాగే యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ యొక్క "MY Bharat" కార్యక్రమాలద్వారాదేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నివారణ మరియు యువతలో అవగాహన కోసం అనేక ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ జాతీయకార్యక్రమాలలో ప్రభుత్వం వారి అనుమతితో భాగస్వామ్యం కావడం బ్రహ్మాకుమారీస్ మెడికల్ విభాగం కు లభించిన గౌరవమని తెలిపారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

Next Story