Parvathipuram: పార్వతీపురంలో డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పోలీసుల తనిఖీలు!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 23 May 2026 10:34 AM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పోలీసుల తనిఖీలు!

పార్వతీపురం: గంజాయి,ఇతర మత్తు పదార్దాలు నిర్మూలనకు జిల్లా పోలీసు శాఖ మరో ముందడుగు వేసి మత్తు పదార్దాలు సేవించే వారిని గుర్తించేందుకు డ్రగ్ డిటెక్షన్ కిట్స్ (THC) తో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ తెలిపారు. యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న గంజాయి, మత్తు పదార్దాలు వినియోగంను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు “ గంజాయి డిటెక్షన్ కిట్లను (THC)” పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

ఈ గంజాయి డిటెక్షన్ కిట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడ్డాయని, వీటి ద్వారా తక్కువ సమయంలో వ్యక్తి గంజాయి, ఇతర మత్తు పదార్దాలు సేవించాడా లేదా అని నిర్ధారణ చేయవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. దీనిలో భాగంగా పార్వతీపురం పట్టణ సిఐ బి.వెంకట్రావు మరియు వారి సిబ్బంది గంజాయి, ఇతర మత్తు పదార్దాలు సేవించే అనుమానితులను గుర్తించేందుకు నిర్వహించిన తనిఖీలలో పార్వతీపురం పట్టణంకి చెందిన శంబంగి సంజయ్ (26సం.లు)ను డ్రగ్ డిటెక్షన్ కిట్ ద్వారా పరీక్షించగా గంజాయి సేవించాడని నిర్ధారణ అయిందని తెలిపారు.

తనిఖీలలో పాజిటివ్ వచ్చిన వ్యక్తికీ ఈ అలవాటు మానుకుని మంచి మార్గంలో నడిచే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, తప్పు తెలుసుకొని సన్మార్గంలో జీవించాలని మరొకసారి చెక్ చేసినప్పుడు అందులో పాజిటివ్ వస్తే వెంటనే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ - నేటి యువత తెలిసి తెలియక తప్పుడు అలవాట్లకు, డ్రగ్స్ (గంజాయి) వంటి వ్యసనాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.

పోలీసుల ముఖ్య ఉద్దేశం కేవలం కేసులు పెట్టడం కాదు, యువతలో అవగాహన (Awareness) కల్పించి, వారిని సరైన మార్గంలో పెట్టి మంచి మార్గంలోనికి తీసుకురావాలని, అదేవిధంగా మత్తు పదార్దాల నిర్మూలనకు అనేక అవగాహనా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, పదార్థాలు లేదా గంజాయికి సంబంధించిన కార్యకలాపాలు కనిపించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయిల్ 100/112 లేదా 1972కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story