S.Kota: వెలుగు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి

S.Kota: ఎస్‌.కోట వెలుగు కార్యాలయంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి సీసీ, వీఓఏలతో సమీక్ష సమావేశం నిర్వహించి వివిధ రుణాల ప్రగతిని సమీక్షించారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA
Published on: 29 Aug 2026 6:09 PM IST
S.Kota
X

S.Kota: వెలుగు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి

ఎస్.కోట: వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో ఈరోజు డి.ఆర్.డి.ఏ విజయనగరం జిల్లా ఆఫీసు నుండి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ శ్రీనివాస పాణి గారు ఈ రోజు సిసి, విఓ ఏ ల తో వెలుగు కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో ఈ ఆర్ధిక సంవత్సరం 2026-27 సంబందించి వెలుగు ద్వారా అమలు అవుతున్న కార్యక్రమాలు గురించి సమీక్షించారు.

సంఘాలు నెలవారి సమావేశాలు సక్రమంగా నిర్వహించడం, సమాజక పెట్టుబడి నిధి cif లోన్ లు మంజూరు చేయడం, రికవరీ 100% చేయడం గురించి మాట్లాడం జరిగినది. మన డబ్బులు మన లెక్కలు ప్రతి సభ్యురాలు కూడా వారి యొక్క మొబైలు లో చూసుకొనేటట్లు అందరకి అవగాహన కల్పించడం గురించి మరియు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు మాన్యూవల్ క్రెడిట్ లైవ్లీ హుడ్ ప్లాన్ ప్రకారం అందరకి అందచేసి ఆర్ధిక అభివృద్ది కార్యక్రమాలకు ఉపయోగించినట్లు చూడాలని తెలియజేశారు.

ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 247 సంఘాలకు గాను 32.20కోట్లు చేసామని తెలిపారు. స్త్రీనిధి ద్వారా ఈ నెల వరకు 9.35కోట్లు లోన్ లు మంజూరు చేయడం జరిగినది అని తెలపడం జరిగినది. ఉన్నతి ద్వారా ఎస్. సి ఎస్.టి కుటుంబాలకు 14.00లక్షలు రూపాయలు ఇవ్వడం జరిగినది అని తెలిపారు.

స్త్రీనిధి లోన్ డాక్యుమెంట్ లు మరియు స్త్రీనిధి ఏ విధంగా మండలం లో లోన్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు మరియు PMFME లోన్ లు స్త్రీనిధి ద్వారా 35%శాతం సబ్సిడీతో లోన్ లు ఇప్పించడం జరుగుతుంది అని ఆహార పదార్ధాలు ప్రొసెసింగ్ చేసే మహిళా వ్యాపారవేత్తలకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొనే విధంగా చూడాలని వి‌ఓ‌ఏ లుకు మరియు సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపిరి.

ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు

1. శ్రీ శ్రీనివాస పాణీ గారు, ప్రాజెక్టు డైరెక్టర్ డి. ఆర్. డి. ఏ- సెర్ప్

2. శ్రీమతి. సావిత్రి గారు అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ డి. ఆర్. డి. ఏ- సెర్ప్

3. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లు శ్రీమతి ఎల్. రాజ్యలక్ష్మి , శ్రీ. లక్ష్మినాయుడు గారు, స్త్రీనిధి ఏ. జి.యం వి.సత్యనారాయణ, జిల్లా స్థాయి ఏ. పి. యం లు

4. ఏ.పి.యం ఎస్. కోట, పి.విజయలక్ష్మి, మండల సిబ్బంది & VOAలు

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

Next Story