Parvathipuram: సుందరయ్య భవనంలో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం!

Parvathipuram: హాస్టళ్లు, కాలేజీల్లో విద్యార్థి సంఘాలు, మీడియాపై ఆంక్షల ఉత్తర్వులను రద్దు చేయాలని పార్వతీపురం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 11 Aug 2026 12:33 PM IST
Parvathipuram
X

Parvathipuram: సుందరయ్య భవనంలో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం!

Parvathipuram: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ళు, కాలేజీలు పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రతి విధులను మీడియా ప్రతినిధుల రాకను నియంత్రిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు మంగళవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు హెచ్ సింహాచలం అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె గంగునాయుడు, కార్యదర్శి ఆర్ ఈశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై మన్మధరావు, ఉపాధ్యక్షులు ఎన్ వై నాయుడు,ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి, శ్రామిక మహిళ నాయకులు వి ఇందిర, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డి వేణు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కే ఈశ్వరరావు, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి జి జ్యోతి, మిడ్డే మేల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి శాంత కుమారి, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ తదితర నాయకులు మాట్లాడుతూ.

రోజురోజుకీ రాష్ట్రంలో నియంత్రత్వ పోకడలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం ప్రజా సమస్యలను వెలికి తీసే లక్ష్యంతో పని చేస్తున్న విద్యార్థి సంఘాలు, సోషల్ మీడియా ప్రతినిధులను, పత్రికా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను హాస్టల్స్ కాలేజీల్లోకి ప్రవేశాన్ని నియంత్రిస్తూ చేసిన ఉత్తర్వులు నిజంగా ప్రజాస్వామ్య దేశంలో సరైనవి కావని విమర్శించారు.

ప్రజా సమస్యను వెలికితీస్తుంటే సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయకుండా ఇలా నిర్బంధం ప్రయోగించి నియంత్రించడం సమంజసం కాదని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వలను రద్దు చేయాలని, లేనియెడల విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story