Salur: అరుణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రావాడ సీతారాం
Salur: గోడ కూలి మృతి చెందిన పదో తరగతి విద్యార్థి అరుణ్ కుమార్ కుటుంబాన్ని ఏపీ ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Salur: అరుణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రావాడ సీతారాం
సాలూరు: సాలూరు నియోజకవర్గంలో జిల్లా ఉన్నత పాఠశాల గోడ కూలి మృతి చెందిన తుపాకుల అరుణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ కమిషన్ రావాడ సీతారాం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆదేశాలతో బాధిత కుటుంబానికి భరోసా.
సాలూరు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గోడ కూలి మృతి చెందిన 10వ తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ గౌరవ సభ్యులు శ్రీ రావాడ సీతారాం పరామర్శించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ విషాద ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పరిస్థితిని తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని శ్రీ రావాడ సీతారాం తెలిపారు.




