Bobbili: సంకిలి చక్కెర కర్మాగారం మూసివేతపై ఎమ్మెల్యేకు వినతి!

Bobbili: సంకిలి ఈఐడి ప్యారీ చక్కెర కర్మాగారం నిలుపుదలను వ్యతిరేకిస్తూ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనను కలసి వినతిపత్రం సమర్పించిన రైతు సంక్షేమ సంఘం నాయకులు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 4 Sept 2026 5:09 PM IST
Bobbili
X

Bobbili: సంకిలి చక్కెర కర్మాగారం మూసివేతపై ఎమ్మెల్యేకు వినతి!

Bobbili: "ఎల్నినో" ప్రభావం వల్ల భారతదేశంలో చక్కెర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, 2027-28 ఆర్ధిక సంవత్సరంలో "సంకిలి" చక్కెర కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలుపదల చేయనున్నట్లు ఈ ఐడి ప్యారీ యాజమాన్యం ప్రకటించారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం మరియు ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన రైతులు, రైతు సంఘాలు ఈ ప్రాంతానికి చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి సంకిలి చక్కెర కర్మాగారాన్ని కాపాడుకునేందుకు మరియు చెరుకు పంటను విస్తరింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) ని ఈరోజు కలిసి ఈ సమస్యను గురించి వివరించారు. ఎమ్మెల్యే బేబీనాయన సానుకూలంగా స్పందించి, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఎమ్మెల్యే గారుని కలిసినవారిలో రాష్ట్ర చెరుకు రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, విజయనగరం జిల్లా సిపిఐ కార్యదర్శి వొమ్మి రమణ, నిష్టల సూర్య ప్రకాష్ భుక్త , కెంబూరి కోటేశ్వరరావు,కర్రీ రమణ,ఎన్ని నారాయణరావు, ఏర్నేన మహేష్, సుఖవాసి వెంకటరమణ,లంక శ్రీనివాసరావు, బుడితి సింహాచలం నాయుడు ఉన్నారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI

Next Story