Vizianagaram: సత్య కళాశాలలో సేవా కార్యక్రమాలు: 50 యూనిట్ల రక్తదానం!

Vizianagaram: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జన్మదినం సందర్భంగా సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో ఎన్ సీ సీ, ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అన్నదానం నిర్వహించారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 9 July 2026 4:54 PM IST
Vizianagaram
X

Vizianagaram: సత్య కళాశాలలో సేవా కార్యక్రమాలు: 50 యూనిట్ల రక్తదానం!

Vizianagaram: సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో రక్తదాన శిబిరం – నెల రోజుల సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ప్రారంభం – ప్రేమ సమాజంలో అన్నదాన కార్యక్రమం.

సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల వ్యవస్థాపక ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ. బొత్స సత్యనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కళాశాలలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ఎన్ సి సి మరియు ఎన్ ఎస్ ఎస్ విభాగాల ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించగా, విద్యార్థులు విశేష ఉత్సాహంతో పాల్గొని 50 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. అనంతరం కళాశాల చివరి సంవత్సరం డిగ్రీ విద్యార్థుల కోసం ఒక నెలపాటు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ప్రేమ సమాజం లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సమాజ సేవ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.

రక్తదాన శిబిరంలో కళాశాల డైరెక్టర్ డా. ఎం. శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డా. ఎం. వి. సాయి దేవ మణి, ఎన్‌సీసీ అధికారులు కెప్టెన్ సత్యవేణి, లెఫ్టినెంట్ ఎం. ఉదయ్ కిరణ్, ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమ అధికారి శ్రీ బి. సూరపు నాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద సేవకులు, రక్తనిధి ఛైర్మన్ శ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story