Jiyyammavalasa: జియ్యమ్మవలస అర్హులందరికీ గృహాలు మంజూరు చేయాలి
Jiyyammavalasa: పిఎంఏవై గృహాల మంజూరుపై ఎంపీపీ సమీక్ష. 2,400 గృహాలకు గాను 1,800 మాత్రమే మంజూరు కావడంపై అధికారులపై ఆగ్రహం.
Jiyyammavalasa: జియ్యమ్మవలస అర్హులందరికీ గృహాలు మంజూరు చేయాలి
జియ్యమ్మవలస: మండల పరిషత్ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) గృహాల మంజూరు అంశంపై మండల అధ్యక్షుడు బొంగు సురేష్ హౌసింగ్ జేఈ ఉమామహేశ్వరరావుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం నుంచి ప్రతిపాదించిన 2,400 గృహాలకు గాను 1,800 గృహాలు మాత్రమే మంజూరయ్యాయని అధికారులు వివరించారు.
అల్లువాడ, అర్నాడ, జియ్యమ్మవలస, డంగభద్ర, కుదమ, కుందర తిరువాడ, టీ.కే. జమ్ము, పీ.టి. మండ పంచాయతీల్లో అర్హులైన లబ్ధిదారులకు తగిన సంఖ్యలో గృహాలు మంజూరు కాకపోవడంపై మండల అధ్యక్షుడు అధికారులను ప్రశ్నించారు. కారణాలు ఏవైనా ఉన్నా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి గృహం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే సంబంధిత పంచాయతీల స్పెషల్ అధికారులతో సమావేశాలు నిర్వహించి, అర్హులైన లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసి గృహాల మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అరకు పార్లమెంటు ఉపాధ్యక్షుడు దాసరి రామారావు నాయుడు, జియ్యమ్మవలస మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు జోగి భుజంగరావు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.




