Komarada: కొమరాడ గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
Komarada: కొమరాడ కేఆర్‌బీ పురం పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆర్బీఎస్‌కే అధికారి డాక్టర్ జగన్ మోహనరావు. గర్భిణులు, గురుకుల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష.
Komarada: కొమరాడ గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కొమరాడ: సురక్షిత ప్రసవాలే లక్ష్యంగా గర్భిణీలకు వైద్య సేవలందించాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. కె.ఆర్.బి పురం పిహెచ్సీ లో పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీలకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, అందుతున్న సేవలపై పరిశీలించారు. తనిఖీల వివరాలు, ల్యాబ్ నివేదికలు ఎం.సి.పి కార్డులో స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.
డా. జగన్ మాట్లాడుతూ గర్భిణీ నమోదు మొదలుకొని ప్రసవానంతరం వరకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు,పర్యవేక్షణ, హైరిస్క్ సమస్యల గుర్తింపు పై దృష్టి సారించాలన్నారు. కాన్పుకు, కాన్పుకు మధ్య నిర్ణీత సమయంతో తల్లి, బిడ్డకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలన్నారు. గిరిశిఖర, మారుమూల గర్భిణీలపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
అనంతరం డా. బి.ఆర్ అంబేడ్కర్ గురుకులo సందర్శించి విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ వివరాలు, సిక్ రిజిస్టర్ పరిశీలించి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకొని పలు వ్యాదులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి. అనూప్, సూపర్వైజర్స్ జయగౌడ్, శారద, శోభ, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




