Rajam: రాజాంలో భారీ చోరీ 25 తులాల బంగారం, నగదు అపహరణ
Rajam: రాజాం బొబ్బిలి సెంటర్‌లో భారీ చోరీ. తీర్థయాత్రకు వెళ్లిన ఇంట్లో 25 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణ. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Rajam: రాజాంలో భారీ చోరీ 25 తులాల బంగారం, నగదు అపహరణ
రాజాం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో వరుస చోరీలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్థానిక బొబ్బిలి సెంటర్‌లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లడాన్ని ఆసరాగా చేసుకున్న దొంగలు బీరువా లాకర్‌ను పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరించారు.
రాజాం బొబ్బిలి సెంటర్‌కు చెందిన ఉండ్రాళ్ల అప్పలరాజు కుటుంబ సభ్యులతో కలిసి గత మంగళవారం దువ్వాడలోని అత్తవారింటికి వెళ్లారు. అక్కడి నుంచి శ్రీశైలం తీర్థయాత్రకు వెళ్లారు. సోమవారం ఉదయం పక్కింటి వారు పూలు కోయడానికి మేడపైకి వెళ్లగా ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. అనుమానం రావడంతో అప్పలరాజు బంధువులకు సమాచారం అందించారు.
అప్పలరాజు రాజాం చేరుకుని ఇంటిని పరిశీలించగా బీరువా తెరిచి ఉండటంతో పాటు లాకర్‌లో ఉన్న విలువైన వస్తువులు కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 25 తులాల బంగారం, 2 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజాం సీఐ నవీన్ కుమార్ దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. ఇటీవల రాజాంలో వరుస చోరీలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




