Bobbili: ఆసుపత్రిలో 100 పడకల కోసం బొబ్బిలిలో టెంట్ వేసి ధర్నా!

Bobbili: బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల నేతలు టెంట్ వేసి నిరసన దీక్ష చేపట్టారు.

P SRINIVASARAO,	BOBBILI
Published on: 11 Sept 2026 2:29 PM IST
Bobbili
X

Bobbili: ఆసుపత్రిలో 100 పడకల కోసం బొబ్బిలిలో టెంట్ వేసి ధర్నా!

బొబ్బిలి: ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టెంట్ వేసి నిరసన చేపట్టారు. బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకలు, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛంద సంస్థలు ఆందోళనకు దిగాయి.

డయాలసిస్ సెంటర్ లేక ఎంతోమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు టెంట్ లోనే కూర్చుని రోజూ నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపకుడు సోరు సాంబయ్య, ఉత్తరాంధ్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మీ నాయుడు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మువ్వల శ్రీనివాసరావు, లెంక సత్యం టెంట్ వేసి నిరసన తెలిపారు.

బొబ్బిలి నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ ఆసుపత్రికి వస్తున్నారని, 100 పడకలు, డయాలసిస్ సెంటర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు.

నాయకులు, అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపేవరకు టెంట్ లోనే ఉండి నిరసన కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. వంద పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

P SRINIVASARAO,	BOBBILI

P SRINIVASARAO, BOBBILI