Vizianagaram: గరికివలస, గుజ్జంగివలసల్లో ఐసీడీఎస్ పోషణ సదస్సులు!
Vizianagaram: చీపురుపల్లి నియోజకవర్గం గరికివలస, గుజ్జంగివలస గ్రామాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం 2026 సదస్సులు నిర్వహించి 5 కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
Vizianagaram: గరికివలస, గుజ్జంగివలసల్లో ఐసీడీఎస్ పోషణ సదస్సులు!
Vizianagaram: పోషణ మాసం 2026 కార్యక్రమాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 9, 2026 నుండి అక్టోబర్ 8, 2026 వరకు నెల రోజుల పాటు పోషకాహారంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ICDS అధికారులు తెలిపారు.
ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 5 ముఖ్య అంశాలతో పోషణ మాసం క్యాలెండర్ ను విడుదల చేసింది. అవి వైవిధ్య భరితమైన పోషకాహారం, అంగన్వాడీలో వేడిగా వండిన భోజనం, సమాజ భాగస్వామ్యం మరియు బాధ్యతాయుతం, పోషణ, ప్రాథమిక విద్య, బాలల వికాసం, ప్రధానమంత్రి మాతృ వందన యోజన మరియు మాతృ సంరక్షణ, ఈ 5 అంశాలపై గ్రామాల్లో తల్లులకు అవగాహన కల్పించడమే ముఖ్య లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
ముఖ్య లక్ష్యాలు:
0 నుండి 6 సంవత్సరాల పిల్లలలో పొట్టితనాన్ని, లోపపోషణను, రక్తహీనతను తగ్గించడం, అలాగే కౌమార దశ బాలికలు మరియు మహిళలలో రక్తహీనతను నివారించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గరికివలస మరియు గుజ్జంగివలస గ్రామాలలో పోషకాహార అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ICDS ప్రాజెక్ట్ అధికారిని ఎన్. ఆరుద్ర గారు, సూపర్వైజర్లు శకుంతల, పద్మ, ANM, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ తల్లులు పాల్గొన్నారు.




