PN Boddavalasa: గురుకుల పాఠశాలలో ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం తనిఖీలు

PN Boddavalasa: పి.ఎన్. బొడ్డవలస APSWRS గురుకుల పాఠశాలను ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం సందర్శించి విద్యార్థుల సౌకర్యాలు, సమస్యలపై నేరుగా ఆరా తీశారు.

B VENKATESH, SALURU
Published on: 26 Aug 2026 5:41 PM IST
PN Boddavalasa
X

PN Boddavalasa: గురుకుల పాఠశాలలో ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం తనిఖీలు

P.N. బొడ్డవలస:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ శ్రీ కె.ఎస్. జవహర్ ఆదేశాల మేరకు, P.N. బొడ్డవలసలోని APSWRS (ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ సభ్యులు శ్రీ రావాడ సీతారాం సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో గౌరవ సభ్యులు శ్రీ రావాడ సీతారాం నేరుగా మాట్లాడి, వారి విద్యాభ్యాసం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, విద్యా బోధన తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలు, అవసరాలు మరియు పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి గౌరవ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు రావాడ సీతారాం వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు.

అలాగే విద్యార్థుల విద్యా ప్రగతి, వారి భవిష్యత్తు లక్ష్యాలు, చదువులో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కూడా తెలుసుకున్నారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story