Bhogapuram Airport: భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం!
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం చంద్రబాబుతో కలిసి ప్రతిష్ఠాత్మక అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం.
Bhogapuram Airport: భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం!
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
ప్రత్యేక విమానంలో భోగాపురం రన్‌వేపై దిగిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మరియు ఇతర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ప్రత్యేక విమానం నుంచి బయటకు వచ్చిన ప్రధాని మోదీ, కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం, ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన టెర్మినల్ భవనాన్ని, రన్‌వేను నేతలు పరిశీలిస్తారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది.
దాదాపు ₹4,700 కోట్లకు పైగా అంచనా వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ విధానంలో నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటకం, పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.




