Parvathipuram: పార్వతీపురం మన్యంలో సెప్టెంబర్ 14న పీజీఆర్‌ఎస్ రద్దు!
Parvathipuram: వినాయక చవితి సెలవుదినం కావడంతో పార్వతీపురం మన్యంలో ఈ నెల 14న పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి వెల్లడి.
Parvathipuram: పార్వతీపురం మన్యంలో సెప్టెంబర్ 14న పీజీఆర్‌ఎస్ రద్దు!
Parvathipuram: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ సోమవారం ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించినందున, జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం రోజున ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడవని, కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. తిరిగి తదుపరి వారంలో యథావిధిగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.




