Parvathipuram: గ్రామానికి రోడ్డు వేయాలని కలెక్టరేట్‌లో గిరిజన యువత వినతి

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సింగుపురం గ్రామానికి తక్షణమే రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని ఐటీడీఏ పీవోకు వినతిపత్రం సమర్పించిన గిరిజన యువకులు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 24 Aug 2026 2:26 PM IST
Parvathipuram
X

Parvathipuram: గ్రామానికి రోడ్డు వేయాలని కలెక్టరేట్‌లో గిరిజన యువత వినతి

పార్వతీపురం: మా గ్రాణానికి రోడ్డు వేయాలని కురుపాం మండలం, గుమ్మిడిగూడ పంచాయతీ, సింగు పురం గిరిజన యువత డిమాండ్ చేసారు..ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీ జి ఆర్ ఎస్ లో పార్వతీపురం ఐ టి డి ఏ, పీ ఓ ఆర్. వైశాలి కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బియ్యల వలస జంక్షన్ నుండి 1.2 కిలో మీటర్లు రోడ్డు గతంలో మంజూరు చేసిన గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు సకాలంలో నిర్మాణం చేయలేదని దింతో నిధులు వెనక్కి పోయిందని మరల ఇప్పుడు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు మంజూరు కోసం ప్రతీ పాదన చేసారని తక్షణమే రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేయాలని డిమాండ్ చేసారు.సానుకూలంగా స్పందించిన పీ ఓ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమం లో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, సింగు పురం గ్రామం యువకులు మండంగి చిరంజీవి, మండంగి బాల కృష్ణ, ఉయక రమేష్, ఉయక భాస్కర్, పువ్వల పురుషోత్తం, ఆరిక మహేష్ లు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story