Parvathipuram: పార్వతీపురంలో 'సామాజిక శంఖారావం'.. వినతిపత్రం సమర్పణ!

Parvathipuram: పార్వతీపురం 18వ వార్డు దళిత వీధుల్లో ప్రజాసంఘాల పర్యటన. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం, కలెక్టరేట్ ఎదుట నిరసన.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 3 Aug 2026 2:23 PM IST
Parvathipuram
X

Parvathipuram: పార్వతీపురంలో 'సామాజిక శంఖారావం'.. వినతిపత్రం సమర్పణ!

పార్వతీపురం: రాష్ట్రవ్యాప్తంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక శంఖారావవం కార్యక్రమంలో భాగంగా సోమవారం పార్వతీపురం పట్టణంలోని 18 వ వార్డులోని దళిత వీధులలో ప్రజా సంఘాల నాయకులు పర్యటించారు.

ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి వి రమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి నాయకులు బి సూరిబాబు మాట్లాడుతూ..స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ల గడిచినప్పటికీ నేటికీ దేశంలో కుల వివక్షత కొనసాగడం అత్యంత విచారకరమని, కులవివక్ష లేని సమాజం కోసం పాలకులు విధానాల రూపొందించాలని డిమాండ్ చేశారు.

నేటికీ దళితులు గిరిజనులకు కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయింపులు జనాభా ప్రాతిపదికన చేయకపోవడం వలన దళిత కాలనీలలో వీధులు దళిత, గిరిజన విద్యార్థులు చదువుతున్న హాస్టల్స్, పాఠశాలల్లో నేటికీ మౌలిక వసతులు కల్పించడం లేదని విమర్శించారు.... ఈ వివక్ష ఎల్లకాలం కొనసాగదని కుల వివక్ష లేని సమాజం కోసం కులవిక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఇతర ప్రజాసంఘాల మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు.

అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ సామాజిక శంఖారావం నిర్వహిస్తున్నామని ఈ పర్యటనలో గుర్తించిన సమస్యలన్నిటిపై కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, కనకమ్మ, సత్యవతి, ధనలక్ష్మి, పద్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story