Parvathipuram: సమస్య ఏదైనా.. 'మీకోసం'లో చెప్పండి.. కలెక్టర్ కీలక ప్రకటన

Parvathipuram: పార్వతీపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) వివరాలు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 7 Jun 2026 7:50 PM IST
Parvathipuram
X

Parvathipuram: సమస్య ఏదైనా.. 'మీకోసం'లో చెప్పండి.. కలెక్టర్ కీలక ప్రకటన

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్ లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ చెప్పారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్ లో ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటు చేశామని చెప్పారు.

అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్ సైట్ లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అర్జీల నమోదుతో పాటు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకొనుటకు 1100 కి నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story