Garugubilli: గరుగుబిల్లిలో సంచార వైద్య శిబిరాలను తనిఖీ చేసిన ఎన్సీడీ అధికారి
Garugubilli: గరుగుబిల్లి మండలం నందివానివలసలో సంచార చికిత్సా శిబిరం, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్సీడీ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు.
Garugubilli: గరుగుబిల్లిలో సంచార వైద్య శిబిరాలను తనిఖీ చేసిన ఎన్సీడీ అధికారి
గరుగుబిల్లి: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని ప్రతీ నెలా పర్యవేక్షణ చేయాలని, సంచార చికిత్సా శిబిరాల్లో పరీక్షలు జరిపి వారి ఆరోగ్యం మెరుగు తీరును పరిశీలించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు ఆదేశించారు. నందివానివలస లో సంచార చికిత్సా శిబిరo, సoతోషిపురం వెల్నెస్ కేంద్రం లను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అక్కడ ఎంత మంది బిపి, షుగరు రోగులకు పరీక్షలు జరిపి మందులు అందజేశారు, వారి ఆరోగ్యం మెరుగు, పర్యవేక్షణపై పరిశీలన చేసి రికార్డులు తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి మందులు వేస్తున్న విధానం పై, అందుతున్న వైద్య సేవలపై తెలుసుకున్నారు. 104 వాహనంలో మందులు, వైద్య పరికరాలను పరిశీలించారు.
అసంక్రమిత వ్యాదుల గుర్తింపు కై చేపడుతున్న ఎన్.సి.డి సర్వే జరుగుతున్న ప్రక్రియ పై ఆన్లైన్ నివేదికలు పరిశీలించి ప్రతీ వారం సర్వే లక్ష్యాలను చేరుకొని త్వరలోనే పూర్తి చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కొత్తగా గుర్తించిన బిపి, షుగరు వ్యాధిగ్రస్తులపై మరింత శ్రద్ధ వహించాలని, క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తిస్తే వైద్యాధికారి ద్వారా అంఖాలజీ విభాగానికి(పిఓయు) పంపాలని సూచించారు.
శిబిరం నిర్వహణపై గ్రామస్తులకు ముందుగా సమాచారం తెలియజేయాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది బి. శ్రావణి, వై. పద్మావతి, వై. యశోద కుమారి, 1O4 సిబ్బంది ఆర్. శివ , ఆశా కార్యకర్తలు ఉన్నారు.




