Parvathipuram: అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ చంద్ర

Parvathipuram: పార్వతీపురంలో 'అమరావతి ఛాంపియన్షిప్ - 2026' ప్రారంభం. క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 28 July 2026 3:11 PM IST
Parvathipuram
X

Parvathipuram: అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ చంద్ర

పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) ఆధ్వర్యంలో నిర్వహించిన "అమరావతి ఛాంపియన్షిప్ - 2026" పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ప్రారంభ కార్యక్రమంలో శాసనసభ్యులు బోనెల విజయ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల, యువత జీవితంలో క్రీడలు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల వల్ల క్రమశిక్షణ, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు అలవడతాయని తెలిపారు.

అలాగే రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీల్లో మన నియోజకవర్గ, జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. 12 రకాల మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్లలో కనీసం సగానికి పైగా పోటీల్లో మన జిల్లా టాప్ లో ఉండాలని ఆకాంక్షించారు. వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో మన జిల్లా ఆటగాళ్లకు మంచి ప్రతిభ ఉందన్న ఆయన... కష్టపడి ఆడి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్స్, ట్రోఫీలు అందుకోవాలని క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

విద్యార్థి క్రీడాకారులకు ఉత్సాహకరంగా ఉండేందుకు ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు చదరంగం మరియు బ్యాడ్మింటన్ ఆడి వారిని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యోగా టీచర్లు, పాఠశాల సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు మరియు టీడీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story