Parvathipuram: కూటమి రెండేళ్ల పాలనలో సంక్షేమ విప్లవం!
Parvathipuram: నర్సిపురం గ్రామంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర 'రెండేళ్ల అభివృద్ధి – సంక్షేమం' కార్యక్రమం.
Parvathipuram: కూటమి రెండేళ్ల పాలనలో సంక్షేమ విప్లవం!
Parvathipuram: రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర, ఆయన సతీమణి శ్రీమతి బోనెల అనూష పర్యటించి, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, దీపం–2, స్త్రీ శక్తి, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15,000, అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20,000, 269 అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం, పేదలకు ఇళ్ల నిర్మాణం, మత్స్యకారులకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు.
అలాగే నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేసేలానాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బోనెల అనూషకు గ్రామంలోని మహిళలు పలుచోట్ల కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే విజయచంద్ర, అనూష కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




