Parvathipuram: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు

Parvathipuram: రక్షాబంధన్ సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు. శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు పొందిన మహిళలు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 28 Aug 2026 2:41 PM IST
Parvathipuram
X

Parvathipuram: ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు

Parvathipuram: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పార్వతీపురం నియోజకవర్గంకు చెందిన పలువురు తెలుగు మహిళలు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు రాఖీలు కట్టి ఆయన ఆయన నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నుండే పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన తెలుగు మహిళలు, ఎన్డీఏ కూటమి పార్టీల మహిళలు పోటాపోటీగా ఎమ్మెల్యే విజయ్ చంద్రకు రాఖీలు కట్టారు. అలాగే మిఠాయిలు తినిపించి ఎమ్మెల్యే విజయ్ చంద్ర నుండి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల , అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలు జరుపుకోవడం, మహిళలు చేత రాఖీలు కట్టించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

నియోజకవర్గం మహిళల ఈ అభిమానం శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు. యావత్ భారత దేశంలో ఈ వేడుకకు ప్రత్యేక స్థానం ఉందని కులాలు, మతాలకు అతీతంగా రాఖీ పండుగ జరుపుకుంటారని వెల్లడించారు. అక్కచెల్లెళ్లకు రక్షకుడిగా నిలిచే అన్నాతమ్ముళ్ళ అనుబంధానికి ఈ వేడుక చిహ్నమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర వివరించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story