Parvathipuram: ప్రజా ప్రభుత్వానికి, గత రౌడీ పాలనకు తేడా చూడండి ఎమ్మెల్యే
Parvathipuram: పార్వతీపురం ములక్కాయ వలసలో ఇంటింటికి టీడీపీ నిర్వహించిన ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర. గిరిజనులతో కలిసి డాన్స్, సంక్షేమ పథకాలపై ప్రచారం.
Parvathipuram: ప్రజా ప్రభుత్వానికి, గత రౌడీ పాలనకు తేడా చూడండి ఎమ్మెల్యే
పార్వతిపురం: గతంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి, వ్యవస్థను సర్వనాశనం చేసిన గంజాయి బ్యాచ్ కు, నేడు పాలన సాగిస్తున్న ప్రజా ప్రభుత్వానికి తేడా చూడాలని ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్వతీపురం మండలండోకిశీల పంచాయతీ ములక్కాయ వలస గ్రామంలో ఆయన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.
ఆ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గిరిజనులు మహిళలతో కలిసి డాన్సులు చేసిన ఎమ్మెల్యే తన నిరాడంబరతను చాటి చెప్పారు. ఇంటింటికి తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని గంజాయి మయంగా మార్చిన వైసిపి నాయకులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుతో ప్రపంచంలో ఎక్కడకి వెళ్లాలన్నా ఇక్కడి నుండే వెళ్లవచ్చునని ఇలాంటి అరుదైన అవకాశం చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు.
అలాగే చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు పథకం, ఉచిత సిలిండర్లు, భారీ ఎత్తున పెంచి అందిస్తున్న పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు న భూతో న భవిష్యత్తు అని పేర్కొన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీ ఎత్తున కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పష్టం చేశారు.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తున్నారని వెల్లడించారు. వైసిపి నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలందరూ తిప్పికొట్టాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మరో రెండేళ్లలో ప్రతి ఇంటికి కనీసం రెండు ఉద్యోగాలు రానున్నాయని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు పార్వతీపురం నియోజకవర్గ పరిశీలకులు RUDA చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి,గొట్టపు వెంకటనాయుడు, బోను చంద్రమౌళి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




