Parvathipuram: సీఎంఓ ఫీడ్‌బ్యాక్ రిపోర్ట్‌లో మెరిసిన పార్వతీపురం మన్యం!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో యూరియా పంపిణీ అత్యంత పారదర్శకంగా సాగుతోందని సీఎంఓ సర్వేలో తేలింది. వ్యవసాయ శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
Parvathipuram: సీఎంఓ ఫీడ్‌బ్యాక్ రిపోర్ట్‌లో మెరిసిన పార్వతీపురం మన్యం!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో యూరియా పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది మరియు డీలర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ప్రతిరోజు క్షేత్రస్థాయి రైతుల నుంచి నేరుగా స్వీకరించే "యూరియా డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ సీఎంఓ ఫీడ్‌బ్యాక్ డైలీ రిపోర్ట్ లో పార్వతీపురం మన్యం జిల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. జిల్లాలో మొబైల్ యాప్, ఓటీపీ లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని సీఎంబో సర్వే చేసిన 100 శాతం మంది రైతులు ధ్రువీకరించారు.
అంతేకాకుండా, యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం లాంటి ఘటనలు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని సర్వేలో వెల్లడైంది. ఎరువుల పంపిణీ సమయంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది మరియు డీలర్ల సేవలు, ప్రవర్తన పట్ల 97.56 శాతం మంది రైతులు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేశారు.
అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్దేశిత ధరలకే యూరియా అందుతోందని 92.68 శాతం మంది రైతులు స్పష్టం చేశారు. రైతులకు సేవ చేయడంలో చూపుతున్న ఈ నిబద్ధతను రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగించాలని, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అందుబాటులో ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.




