Parvathipuram: మన్యం జిల్లాలో ఎక్సైజ్ రైడ్స్.. 20 లీటర్ల నాటుసారా సీజ్

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో ‘నవోదయం 2.0’లో భాగంగా ఎక్సైజ్ అధికారులు భారీ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.

V.SESHU	, KURUPAM
Published on: 9 July 2026 6:49 AM IST
Parvathipuram
X

Parvathipuram: మన్యం జిల్లాలో ఎక్సైజ్ రైడ్స్.. 20 లీటర్ల నాటుసారా సీజ్

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సర్కిల్ పరిధిలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా చినమేరంగి, గవరంపేట గ్రామాల్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ. సంతోష్ ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నాటుసారా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి, అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు దూరంగా ఉండాలని సూచించారు.

అనంతరం గవరంపేట గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో అదే గ్రామానికి చెందిన సిరిపురపు శ్రీను వద్ద 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి న్యాయస్థాన రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో చినమేరంగి గ్రామానికి చెందిన బొమ్మాళి సునీల్ అలియాస్ చిన్న ప్రమేయం ఉన్నట్లు గుర్తించి అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా కురుపాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 190 లీటర్ల నాటుసారా, 16 లీటర్ల మద్యాన్ని విజయనగరం డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రీనివాసరావు తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story