Parvathipuram: ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ సెల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన మరియు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 15 May 2026 4:21 PM IST
Parvathipuram
X

Parvathipuram: ఈగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా ఈగల్ సెల్ ఆధ్వర్యంలో “సబ్‌స్క్రైబ్ ఈగల్ సోషల్ మీడియా అండ్ అవేర్‌నెస్” కార్యక్రమాన్ని గురువారం పార్వతీపురంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల్ సిబ్బందితో పాటు ప్రజలకు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఐజీపీ ఆకే రవి కృష్ణ, IPS, ఈగల్ ఎస్పీ (ఆపరేషన్స్) ఎం. మహేశ్వర్ రాజు IPS, ఈగల్ ఎస్పీ అడ్మిన్ కె. నాగేష్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ చైతన్యం ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్‌తో పాటు ఈగల్ విభాగం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.

గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను తెలియజేశారు. గంజాయి రవాణా లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు. అలాగే NDPS చట్టాలపై అవగాహన కల్పిస్తూ, డ్రగ్స్ కేసుల్లో చిక్కుకుంటే జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్‌లపై కూడా ప్రజలకు సూచనలు ఇచ్చారు. చివరగా మహిళలతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదాలు చేయించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story