Parvathipuram: టెన్త్, ఇంటర్ ప్రతిభావంతులకు పురస్కారాలు: కలెక్టర్!
Parvathipuram: పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో రేపు "షైనింగ్ స్టార్స్ - 2026" సత్కార జరగనుంది.
Parvathipuram: టెన్త్, ఇంటర్ ప్రతిభావంతులకు పురస్కారాలు: కలెక్టర్!
పార్వతీపురం: ఈ ఏడాది పదవ తరగతి, ఇంటర్ ఫలితాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, జిల్లాకు మంచి పేరు తెచ్చిన విద్యార్థులను అభినందిస్తూ, ప్రోత్సహించేలా విద్యా శాఖ ఆధ్వర్యంలో "షైనింగ్ స్టార్స్ - 2026" పేరిట గౌరవ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 9:00 గంటల నుండి బెలగాం పరిధిలోని గెడ్డవీధి చివరన గల అనూ కన్వెన్షన్ హాల్ నందు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కావున జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ నిర్ణీత సమయానికి ఈ కార్యక్రమానికి విచ్చేసి, విద్యార్థులను ఆశీర్వదించి ఈ సత్కార మహోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.




