పార్వతీపురంలో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి!

పార్వతీపురం మన్యం జిల్లా బెలగాం డివిఎమ్ఎమ్ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ప్రారంభించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 28 Jun 2026 1:28 PM IST
పార్వతీపురంలో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి!
X

పార్వతీపురంలో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి!

పార్వతీపురం: బెలగాం చర్చి వీధిలోని డీవీఎంఎం (DVMM) పాఠశాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని, ఒక్క చిన్నారిని కూడా మిస్ కాకుండా ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

1,99,386 మందికి లక్ష్యం

పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మొదటి రోజైన జూన్ 28న పోలియో కేంద్రాల వద్ద 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు చుక్కలు వేయగా, జూన్ 29 మరియు 30 తేదీల్లో కార్యకర్తలు ఇంటింటా తిరిగి, మిగిలిపోయిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నారు.జిల్లాలో 99,507 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 2,48,524 గృహాలను సందర్శిస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.​

ఈ కార్యక్రమం కోసం జిల్లాలో 905 కేంద్రాలను ఏర్పాటు చేయగా, శిక్షణ పొందిన కార్యకర్తలు, బృందాల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. మురికివాడలు, సంచార జాతులు, కొండ ప్రాంతాలు వంటి హైరిస్క్ ఏరియాల్లోని పిల్లలకు చుక్కలు వేయడానికి 42 మొబైల్ బృందాలను, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని ప్రయాణికుల పిల్లల కోసం 19 ట్రాన్సిట్ బృందాలను సిద్ధం చేశారు. జిల్లాకు మొత్తం 1,21,398 డోసులను ఇప్పటికే ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story