Parvathipuram: మన్యం జిల్లాలో ఘనంగా విద్యుత్ భద్రతా అవగాహన ర్యాలీ
Parvathipuram: మన్యం జిల్లాలో విద్యుత్ భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. లైన్లకు దూరంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఈ త్రినాథ రావు తెలిపారు.
Parvathipuram: మన్యం జిల్లాలో ఘనంగా విద్యుత్ భద్రతా అవగాహన ర్యాలీ
పార్వతీపురం మన్యం జిల్లా...
జిల్లాలో ఘనంగా విద్యుత్ భద్రతా అవగాహన ర్యాలీ
విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి.. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన ఉండాలి
పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. త్రినాథ రావు
పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ (APEPDCL) పార్వతీపురం మన్యం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణపై మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) పి. త్రినాథ రావు ముఖ్య అతిథిగా హాజరై, జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి వారి ఆదేశాలతో ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. త్రినాథ రావు మాట్లాడుతూ, ప్రజల్లో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. పార్వతీపురం, పాలకొండ, సాలూరు టౌన్లలో విద్యుత్ ఉద్యోగులందరూ సమిష్టిగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
వైర్లపై తడి బట్టలతో గానీ, తడి చేతులతో గానీ తాకరాదు. ఎల్లప్పుడూ నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వాడాలి. ఇల్లు కట్టుకునే సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. రాడ్లు, నిచ్చెనలు లేదా పనిముట్లు భవనంపైకి తీసుకెళ్లేటప్పుడు తగినంత క్లియరెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. అవసరమైతే విద్యుత్ శాఖ అధికారుల అనుమతి తీసుకొని లైన్ క్లియరెన్స్ పొందిన తర్వాతే పనులు చేపట్టాలి. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉంటుంది. సరఫరా లేదు అనుకుని తెగిపడిన వైర్లను చేత్తో గానీ, కాలితో గానీ తాకవద్దు. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలి.సాధారణంగా విద్యుత్ శాఖ ఉద్యోగులకు శిక్షణ ద్వారా అవగాహన ఉంటుందని, అయితే ప్రమాదాల బారిన పడుతున్న భవన కార్మికులు, వీధి వ్యాపారులు, షాపుల సిబ్బంది, రైతులలో అవగాహన లోపమే ప్రధాన కారణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల షాపులకు బ్యానర్లు/నేమ్‌బోర్డులు కట్టేటప్పుడు, విద్యుత్ లైన్ల స్పర్శ వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయని గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించి ప్రాణ నష్టాలను అరికట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఇంజనీర్లు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యుత్ భద్రతా ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.




