Parvathipuram: భూ రీ-సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలి జేసీ వైశాలి
Parvathipuram: పార్వతీపురం కలెక్టరేట్‌లో రెవెన్యూ అంశాలు, రీ-సర్వే పురోగతిపై తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించిన జేసీ ఆర్. వైశాలి. పెండింగ్ అర్జీల పరిష్కారానికి ఆదేశం.
Parvathipuram: భూ రీ-సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలి జేసీ వైశాలి
పార్వతీపురం: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి నేతృత్వంలో రెవెన్యూ అంశాలు, రీ-సర్వే పురోగతిపై తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్‌డీఓ మాధురిలతో కలిసి జేసీ రెవెన్యూ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
భూ రీ-సర్వే పనులను నిర్దేశిత సమయానికే పూర్తి చేయాలని, ఎక్కడా రీ-సర్వేలో అలసత్వానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలతో పాటు, రెవెన్యూకి సంబంధించిన ఇతర పెండింగ్ దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
సరిహద్దు వివాదాలు మరియు రెవెన్యూ రికార్డుల దిద్దుబాట్లకు సంబంధించిన ఫిర్యాదులపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.సమావేశంలో మాట్లాడిన సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ మాధురిలు మండలాల వారీగా జరుగుతున్న రీ-సర్వే పురోగతిని, ఎదురవుతున్న సాంకేతిక/క్షేత్రస్థాయి సవాళ్లను జేసీకి వివరించారు. ఈ సమావేశంలో వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.




