Parvathipuram: గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ పీవోకు వినతిపత్రం!

Parvathipuram: పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్. వైశాలికి పలు గిరిజన సమస్యలపై గిరిజన సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. పీవో సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 14 Aug 2026 4:55 PM IST
Parvathipuram
X

Parvathipuram: గిరిజన సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ పీవోకు వినతిపత్రం!

Parvathipuram: పలు గిరిజన సమస్యలు పరిస్కారం చేయాలని కోరుతూ పార్వతీపురం ఐ టి డి ఏ, పీ ఓ, ఆర్. వైశాలి కు వినతిపత్రం ఇచ్చినట్లు గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, గిరిజన నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బొండపల్లి జనార్దన్ లు తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పీ. కొన వలస గిరిజన గురుకుల కళాశాల లో ఉద్యోగం చేస్తూ మృతి చెందిన పీ. పెంటయ్య కుమారుడు భీమా శంకర్ కు ఉపాధి చూపాలని, పార్వతీపురం మండలం పెద మరికి గ్రామానికి చెందిన హిమరక సుబ్బమ్మకు ఎస్టీ జాతపు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని, పార్వతీపురం లోని గిరిజన సామజిక భవనం "స్టోర్ రూమ్ "చేసారని అందులో సామాగ్రి తరలించాలని శుక్రవారం ఐ టి డి ఏ ఆఫీస్ లో జరిగిన "గ్రీవెన్స్" వినతిపత్రం ఇచ్చామని వివరించారు.

సానుకూలంగా స్పందించిన పీ ఓ సమస్యలు పరిస్కారం చేస్తామని తెలిపారని రంజిత్ కుమార్ అన్నారు.ఈ కార్యక్రమం లో భీమా శంకర్, సుబ్బమ్మ ,రాము, శివ తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story