Parvathipuram: పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం

Parvathipuram: పార్వతీపురం పట్టణంలో తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరోపించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 29 Aug 2026 5:04 PM IST
Parvathipuram
X

Parvathipuram: పట్టణ ప్రజలకు తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం

పార్వతీపురం: పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ కుమార్,ఈవి నాయుడు గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి మర్రి సీతారాం దొర ఆరోపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలు వేలాది రూపాయలను పన్నుల రూపంలో మున్సిపాలిటీకి చెల్లిస్తున్నప్పటికీ అందుకు తగిన విధంగా మౌలిక సదుపాయాలను అందుకోలేని దౌర్భాగ్య స్థితిలో పట్టణ ప్రజలు ఉన్నారన్నారు.

ఎన్నికల ముందు పోటీ చేసే పార్టీల అభ్యర్థులు మాత్రం ఈ మున్సిపాలిటీ పైన ప్రజల పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఎన్నికలలో గెలిచిన అనంతరం మొదటిసారిగా పట్టణంలో ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని మభ్యపెట్టి గారడీ మాటలు చెప్పి ప్రజల దగ్గర నుంచి ఓట్లు గుంజుకొని గద్దెనెక్కిన అనంతరం ఈ పట్టణ ప్రజల బాగోగులను గాలికి వదిలేసే పరిస్థితి నెలకొందని ఇటీవల గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు కూడా ఇవే కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారని ప్రజలకు త్రాగునీరు అందించేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

ఈ మున్సిపాలిటీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేందుకు ఏ ఒక్క కమిషనర్ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించకుండా సకాలంలో సెలవు పెట్టి వెళ్లే పరిస్థితి నెలకొందని, జిల్లా ఉన్నతాధికారి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి మధ్య సఖ్యత లేకపోవడమే కారణంగా తెలియవచ్చిందని, వీరిరువురు మధ్య ఇమడి లేకనే మున్సిపల్ అధికారులు సెలవులపై వెళిపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయని,ఇప్పటికైనా వీరిరువురు పునరాలోచన చేసి సఖ్యతతో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story