Parvathipuram: పాలకొండ జగన్నాథునికి పంచలోహ కిరీటాల విరాళం
Parvathipuram: పాలకొండ జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర మూర్తులకు కైలాష్ సాహు అందించిన పంచలోహ కిరీటాలకు గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
Parvathipuram: పాలకొండ జగన్నాథునికి పంచలోహ కిరీటాల విరాళం
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ
పాలకొండ: పాలకొండ లో వెలసిన శ్రీ జగన్నాథ్ స్వామి కి పంచలోహ ఇత్తడి కిరీటాలు పాలకొండ కు చెందిన కైలాష్ సాహు తయారు చేయించి గురువారం అందించారు. జగన్నాథ్ స్వామి, బలభద్రుడు, సుభద్రదేవికి కిరీటాలకి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కి ఇలాంటి దాతలు ముందుకు రావాలని పట్టణంలో ప్రముఖ వ్యక్తి పల్లా కొండలరావు అన్నారు. గతంలో జగన్నాథ్ స్వామి వారి నూతన రథం ఇదే తరహాలో పూర్తి చేసుకోగలిగం అని అన్నారు. జగన్నాథ్ స్వామి రాధ యాత్రలో భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు, ఆలయ ఈవో లలిత కుమారి,రాంబాబు, చంటి, సాయి, తదితరులు మరియు ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
Next Story




