Parvathipuram: ఆర్టీసీ ప్రైవేటీకరణను ఆపాలి ఏఐటీయూసీ డిమాండ్

Parvathipuram: ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దని పార్వతీపురం డిపో మేనేజర్‌కు ఏఐటీయూసీ వినతిపత్రం. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 23 July 2026 2:55 PM IST
Parvathipuram
X

Parvathipuram: ఆర్టీసీ ప్రైవేటీకరణను ఆపాలి ఏఐటీయూసీ డిమాండ్

పార్వతీపురం: ఎఐటియుసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎపిఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దని, ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించాలని కోరుతూ గురువారం పార్వతీపురం డిపో మేనేజర్ లక్ష్మణరావుకు ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్వీఎస్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు అత్యంత కీలకమైన ప్రజా రవాణా సంస్థ అని, దీనిని ప్రైవేటీకరించడం వల్ల ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడటంతో పాటు ఉద్యోగుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా రవాణా రంగాన్ని ప్రోత్సహించే విధానాలను అమలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రజలకు నాణ్యమైన రవాణా సేవలందించాలంటే ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ అవసరమని, అయితే వాటి నిర్వహణ బాధ్యత పూర్తిగా ఆర్టీసీకే అప్పగించాలని కోరారు.

ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆర్టీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విద్యుత్తు బస్సుల కొనుగోలు పేరుతో కార్పొరేట్ సంస్థలకు ఆర్టీసీ ఆస్తుల అమ్మకాలను వ్యతిరేకిస్తున్నామని సూపర్ సిక్స్ శ్రీ శక్తి పథకం నడిపేందుకు ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటీకరిస్తే ఎఐటియుసి ఎర్రజెండా ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆర్టీసీ ఆస్తులు కాపాడుకుంటామని ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకై పోరాటం ప్రజలకు ప్రయాణ సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు పోరాటానికి దిగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఆర్టీసీ డిపో నాయకులు డి.ఎ. నాయుడు, జె యం రావ్,కే బి రాజు,కేఎస్ రావు,టీజీ స్వామి తదితరులు పాల్గొన్నారు

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story