Palakonda: పాలకొండలో అధికారుల సమీక్ష.. అభివృద్ధి పనులపై స్పెషల్ ఫోకస్!
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో అధికారులతో సమీక్షా సమావేశం.
Palakonda: పాలకొండలో అధికారుల సమీక్ష.. అభివృద్ధి పనులపై స్పెషల్ ఫోకస్!
పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ మండలం మండల పరిషత్ ఆఫీస్ నందు మండల స్థాయి అధికారులుతో మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు మండల స్పెషల్ ఆఫీసర్స్ తో సమావేశంలో పాల్గొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేయాలని సూచించారు.ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామస్థాయిలో పారదర్శకతతో పని చేసి ప్రజల్లో విశ్వాసం పెంచాలని సూచించారు.పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తెలుసుకోవాలని చెప్పారు.తాగునీరు, రోడ్లు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ప్రతి శాఖ అధికారి తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు.ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోసం కృషి చేయాలని కోరారు.ప్రజల సేవే ముఖ్యమని, అదే మన బాధ్యత అని పేర్కొన్నారు.




