Vizianagaram: ఒడిశాలో ప్రియురాలి హత్య ఆంధ్రాలో మృతదేహం పూడ్చివేత!

Vizianagaram: ఒడిశాలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని హత్య చేసి, విజయనగరం జిల్లా గజపతినగరంలో పూడ్చిపెట్టిన ప్రియుడు. ఇరు రాష్ట్రాల పోలీసుల జాయింట్ ఆపరేషన్.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 14 Aug 2026 5:27 PM IST
Vizianagaram
X

Vizianagaram: ఒడిశాలో ప్రియురాలి హత్య ఆంధ్రాలో మృతదేహం పూడ్చివేత!

Vizianagaram: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది.ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియురాలి ని ఆంద్రా లో పూడ్చి పెట్టిన ప్రియుడు. ప్రియురాలు ఒడిశా రాష్ట్రం తున్ ఖల్ గ్రామానికి చెందిన అలూ మీనా (22) ,ప్రియుడు కకిగా గ్రామం (ఒడిశా) కు చెందిన అబ్బాయి మోహన్ కిల్లో (35).

వీరిద్దరూ రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్నారు.నెలరోజుల క్రితం వరకు అమ్మాయి తల్లిదండ్రులు ఈ వ్యవహారం తెలియలేదు.14 రోజులు గా అమ్మాయి కనిపించకపోవడంతో శిమిలిగుడా (ఒడిశా) స్టేషన్ లో ప్రియుడిపై పిర్యాదు చేసారు.

ఒరిస్సా పోలీసులు ప్రియుడైన మోహన్ కిల్లోను విచారించగా, ఎట్టకేలకు గజపతినగరం మండలం మరుపల్లి పెట్రోల్ బంక్ కు సమీపంలో ఉన్న మామిడి తోటలో మృతదేహాన్ని, పూడ్చిపెట్టినట్లుగా సమాచారం తెలుసుకున్న ఒరిస్సా పోలీసులు.

కుటుంబ సభ్యులు గజపతినగరం పోలీసులను ఆశ్రయించారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు.ఒడిశా పోలీసులు తో పాటు గా ఆంద్రా పోలీసులు .పూడ్చి పెట్టిన మృతదేహాన్ని తవ్వి బయటకు తీసి శవ పంచన అనంతరము ఒరిస్సా పోలీసులకు కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story