Parvathipuram: "నా అవసరాలు - సవాళ్లు".. గరుగుబిల్లిలో బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమం!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో "నా అవసరాలు – సవాళ్లు" పేరిట కిశోర బాలికలతో ముఖాముఖి నిర్వహించారు.
Parvathipuram: "నా అవసరాలు - సవాళ్లు".. గరుగుబిల్లిలో బాలికల కోసం ప్రత్యేక కార్యక్రమం!
గరుగుబిల్లి: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్ది. ఆదేశాల మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి టి. కనకదుర్గ ఆధ్వర్యంలో గరుగుబిల్లి గ్రామంలో “నా అవసరాలు – సవాళ్లు” అనే అంశంపై కిశోర బాలికలతో ముఖాముఖి సంభాషణ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ మాట్లాడుతూ, కిశోర బాలికల సమగ్ర అభివృద్ధి, మానసిక ఆరోగ్యం మరియు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బాలికలు ఎదుర్కొంటున్న సామాజిక ఒత్తిడులు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు మరియు ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను ఎలా చేరుకోవాలో ఆయన వివరించారు. బాలికలు తమ విద్య, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు మరియు ఎదుర్కొంటున్న సవాళ్లపై అధికారులతో నేరుగా చర్చించారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా, సైబర్ భద్రత మరియు చట్టపరమైన హక్కులపై బాలికలకు అవగాహన కల్పించారు. బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ఐసిడిఎస్ అధికారులు వివరించారు. ఏదైనా ఆపద కలిగినప్పుడు నిర్భయంగా తల్లిదండ్రులకు లేదా 1098 వంటి అత్యవసర సేవలను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆర్. లక్ష్మి, కౌన్సిలర్ జి. తవిటి నాయుడు, అంగన్వాడీ టీచర్లు ఎం. స్వాతి, ఎం. పద్మావతి, పి. కృష్ణవేణి మరియు పెద్ద సంఖ్యలో కిశోర బాలికలు పాల్గొన్నారు.




