Vizianagaram: విజయనగరంలో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన జడ్జి పి బుజ్జి!

Vizianagaram: విజయనగరం జిల్లాలోని పలు ప్రభుత్వ వసతి గృహాలను మొబైల్ కోర్టు జడ్జి P. బుజ్జి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు సౌకర్యాలపై ఆరా తీశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 26 Aug 2026 5:42 PM IST
Vizianagaram
X

Vizianagaram: విజయనగరంలో సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసిన జడ్జి పి బుజ్జి!

Vizianagaram: ఈ రోజు అనగా తేది 26-08-2026 న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారి యొక్క ఆదేశాలు మేరకు ఈ రోజు ప్రీ మెట్రిక్ గవర్నమెంట్ బిసి బాయ్స్ హాస్టల్(బోనంగి, గంట్యాడ), పోస్ట్ మెట్రిక్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్(మంగళ వీధి, విజయనగరం ), పోస్ట్ మెట్రిక్ గవర్నమెంట్ బిసి కాలేజ్ గర్ల్స్ హాస్టల్ (నెల్లిమర్ల ), ప్రీ మెట్రిక్ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్( రామతీర్థం, నెల్లిమర్ల ) వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు

ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి విద్య, ఆరోగ్యం, ఆహారం, వసతి, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు మరియు ఇతర మౌలిక వసతుల గురించి వివరాలు తెలుసుకున్నారు.

వంటశాల, భోజనశాల, నిల్వ గది, మరుగుదొడ్లు, స్నానాల గదులు, పడక గదులు మరియు పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ నిర్వహణను మరింత మెరుగుపరచాలని, పరిశుభ్రతను ఎల్లప్పుడూ పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని న్యాయమూర్తి వారికి ప్రోత్సాహం అందించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story