Vizianagaram: ఒకేరోజు ఇద్దరు నేతల కుటుంబాలను పరామర్శించిన బొత్స!

Vizianagaram: చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటీవల మృతిచెందిన కొనిసి కృష్ణంనాయుడు, గడే రామునాయుడు కుటుంబాలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించి భరోసానిచ్చారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 26 Aug 2026 6:43 PM IST
Vizianagaram
X

Vizianagaram: ఒకేరోజు ఇద్దరు నేతల కుటుంబాలను పరామర్శించిన బొత్స!

విజయనగరం: ఎంత ఎత్తుకు ఎదిగినా నేల విడిచి సాము చేయని నాయకుడిగా, కార్యకర్తల కష్టంలో అండగా నిలిచే నేతగా మరోసారి నిరూపించుకున్నారు మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. నేడు ఒకేరోజు రెండు మండలాల్లో పర్యటించిన బొత్స, ఇటీవల మృతి చెందిన ఇద్దరు సీనియర్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు.

గెడ్డపువలసలో: గరివిడి మండలం గెడ్డపువలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణంనాయుడు కుటుంబాన్ని పరామర్శించి, ఆయన భార్యకు, కుమారుడు కల్యాణ్ కు ధైర్యం చెప్పారు. మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు.

పెదనడిపల్లిలో: అనంతరం చీపురుపల్లి మండలం పెదనడిపల్లి మాజీ సర్పంచ్ గడే రాము నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన వెంట మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా ఉన్నారు.

అధికారంలో ఉన్నా, లేకపోయినా కార్యకర్తే మా బలం. వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని బొత్స భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మీసాల విశ్వేశ్వరరావు, మీసాల వరహాల నాయుడు, ఎడ్ల అప్పారావు, వలిరెడ్డి శ్రీనివాస్, బెల్లాన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story