Parvathipuram: రైతుల డీలర్ల నియామకంపై మంత్రి నాదెండ్లకు ఎమ్మెల్యే వినతి!

Parvathipuram: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు, రైతులు-మిల్లర్ల సమస్యలు, నిలిచిపోయిన డిపో డీలర్ల నియామకాలపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసిన ఎమ్మెల్యే విజయచంద్ర.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 7 Aug 2026 12:15 PM IST
Parvathipuram
X

Parvathipuram: రైతుల డీలర్ల నియామకంపై మంత్రి నాదెండ్లకు ఎమ్మెల్యే వినతి!

Parvathipuram: రాబోయే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మంత్రి గారి దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులతో పాటు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగానే పరిష్కరించి, కొనుగోలు ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు తమ పంటను సకాలంలో విక్రయించుకునేలా, మిల్లర్లకు ఎదురవుతున్న పరిపాలనా, సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో నిలిచిపోయిన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు.ఎల్-నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి, అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరారు.మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే గారి వినతులపై సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story