Palakonda: రూ.1.95 కోట్లతో వెంకటరాయుని కోనేరు అభివృద్ధి: ఎమ్మెల్యే నిమ్మక!
Palakonda: రూ.1.95 కోట్ల సూడా నిధులతో పాలకొండ వెంకటరాయుని కోనేరు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సూడా చైర్మన్ కొరికాన రవికుమార్ శంకుస్థాపన చేశారు.
Palakonda: రూ.1.95 కోట్లతో వెంకటరాయుని కోనేరు అభివృద్ధి: ఎమ్మెల్యే నిమ్మక!
పాలకొండ: పాలకొండ పట్టణంలోని వెంకటరాయుని కోనేరు అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. సుమారు రూ.1.95 కోట్ల SUDA నిధులతో చేపట్టనున్న వెంకటరాయుని కోనేరు అభివృద్ధి పనులకు గౌరవ పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు, SUDA చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ గారు కలిసి శంకుస్థాపన చేశారు.
పాలకొండ పట్టణ నడిబొడ్డున ఉన్న వెంకటరాయుని కోనేరు చెరువును కేవలం నీటి వనరుగా కాకుండా ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే ఆధునిక వినోద, పర్యాటక మరియు ప్రజా సౌకర్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువు చుట్టూ సుమారు 950 మీటర్ల మేర రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. పిల్లల కోసం ప్రత్యేక చిల్డ్రన్స్ ప్లే జోన్ ఏర్పాటు చేసి బాక్స్ క్రికెట్, మల్టీ ప్లే సిస్టమ్, స్వింగ్స్, సీ-సా, మెర్రీ-గో-రౌండ్, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సిట్టింగ్ జోన్, షేడెడ్ గెజిబో మరియు గ్రానైట్ సీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రజల సౌకర్యార్థం ఈటరీ & పార్కింగ్ జోన్ ఏర్పాటు చేసి ఫుడ్ కియోస్కులు, పేవ్డ్ వాకింగ్ పాత్, పార్కింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు.
సాయంత్రం వేళల్లో కూడా ప్రజలు వినియోగించుకునేలా LED ఫ్లడ్ లైట్లు, హైమాస్ట్ లైట్లు, డెకరేటివ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. తాగునీరు మరియు ఇతర అవసరాల కోసం వాటర్ సప్లై వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, మొక్కలు, ల్యాండ్‌స్కేపింగ్ అభివృద్ధి చేయనున్నారు
పాలకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం మరియు SUDA ద్వారా అందుతున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ప్రజా సౌకర్యాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
పాలకొండ పట్టణానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా పనులను నాణ్యతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చి పాలకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.
SUDA చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ మాట్లాడుతూ పాలకొండ పట్టణ అభివృద్ధికి SUDA ద్వారా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రూ.1.95 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వెంకటరాయుని కోనేరు అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
చెరువు పరిరక్షణతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా వినోద, క్రీడా, వాకింగ్, సిట్టింగ్ మరియు పచ్చదనం వంటి అన్ని అంశాలను సమన్వయం చేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం పాలకొండ పట్టణానికి ఒక కొత్త ల్యాండ్‌మార్క్‌గా వెంకటరాయుని కోనేరు నిలుస్తుందని SUDA చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పాలకొండ అభివృద్ధే లక్ష్యం ప్రజలకు మెరుగైన సౌకర్యాలే ధ్యేయం వెంకటరాయుని కోనేరు అభివృద్ధి – పాలకొండకు కొత్త ఆకర్షణసమగ్ర పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి.




