Vizianagaram: ఎస్.కోట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం
Vizianagaram: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
Vizianagaram: ఎస్.కోట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం
విజయనగరం: ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్థానిక ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభించింది.
ఈ సందర్భంగా జరిగిన ప్రజాదర్బార్‌లో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 118 వినతులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా పెన్షన్ల మంజూరు, మార్పులకు సంబంధించి 112 అర్జీలు రాగా.. రెవెన్యూ విభాగానికి సంబంధించి 3 వినతులు వచ్చాయి.
అలాగే ఇరిగేషన్, ఎండోమెంట్ దేవాదాయ శాఖ ఈపీడీసీఎల్ (విద్యుత్ శాఖ) సమస్యలపై ఒక్కొక్కటి చొప్పున వినతులు వచ్చాయి.
Next Story




